చీనీతోట పరిశీలన

చీనీతోట పరిశీలన

చీనీతోటను పరిశీలిస్తున్న ఉద్యానవన శాఖ అధికారిణి ఉమాదేవి

పెద్దపప్పూరు : మండలంలోని నామనాంకపల్లి గ్రామంలో తెగులు వచ్చి తొలగించిన చీనీ తోటను ఉద్యానవన శాఖ అధికారిణి ఉమాదేవి బుధవారం పరిశీలించారు. తెగులు సోకి గ్రామాలోని ఓ రైతు 400 చీనీ చెట్లను నరికివేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రజాశక్తి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన ఉద్యానవన అధికారిణి ఉమాదేవి గ్రామానికి చేరుకుని నరికిన చీనీ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పండ్ల తోటలకు వేరుకుళ్లు, బంక తెగుళ్లు, పొలుసు పురుగు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వీటికి అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రం అధికారి, రైతులు పాల్గొన్నారు.

➡️