గత ప్రభుత్వ బాధ్యతారాహిత్యం

Dec 7,2024 11:50 #Anantapuram District
  • పిల్లల్లో సమాజం పట్ల బాధ్యత పెంపొందించాలి
  • కాంపౌండ్ వాల్ నిర్మించి ఇస్తా
  • సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట 

ప్రజాశక్తి-కదిరి టౌన్ : పాఠశాల ఉపాధ్యాయులపై పిల్లలు తిరగబడే పరిస్థితులు దాపిరించాయంటే గత ప్రభుత్వ వైఫల్యం బాధ్యతారహిత్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు సమాజం పట్ల బాధ్యత పెంపొందేలా వారికి నేర్పించాలన్నారు. గత ప్రభుత్వం వైఫల్యం బాధ్యతారహిత్య కారణంగా పాఠశాలలోకి గంజాయి ప్రవేశించిందని తద్వారా చదువుకునే విద్యార్థులు గంజాయి బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ వైఫల్యమే నేడు ఉపాధ్యాయులపై పిల్లలు తిరగబడే దుస్థితి ఏర్పడిందన్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు చేరువయ్యేందుకు ప్రభుత్వ పాఠశాలలో సమావేశాలకు నాంది పలికారన్నారు.

➡️