సుబ్బరాయుడు సాగర్ ను పరిశీలించిన ఇరిగేషన్ ఎస్సీ

Nov 29,2024 12:04 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు: మండల పరిధిలో ఉన్న సుబ్బరాయుడు సాగర్ ను శుక్రవారం ఇరిగేషన్ ఎస్ సి రాజశేఖర్ పరిశీలించారు. సుబ్బరాయుడు సాగర్ కు 8.5 మీటర్లు నీళ్లు రావడంతో రెండు మూడు రోజుల్లో సుబ్బరాయ్ సాగర్ నుంచి పుట్లూరు చెరువుకు నీటిని విడుదల చేయాలని హెచ్ ఎల్ సి అధికారులు సూచించడంతో ఇరిగేషన్ ఎస్సీ సుబ్బరాయుడు సాగర్ పరిశీలించి అక్కడనుండి తుంపెర డీప్ కట్ వరకు నీటి సామర్ధ్యాన్ని పరిశీలించారు. మీరు వెంట ఎచ్.ఎల్.సి జేఈఈ లు డి ఈ రైతులు కోమటికుంట్ల కులశేఖర్ రెడ్డి, ఎల్కే చెన్నారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ నారాయణ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వెంకట్ రాముడు, రాజకుమార్, జనార్దన్ రెడ్డి, వీరయ్య, నాగేష్ తదితర రైతులు అధికారులు పాల్గొన్నారు.

➡️