భారత జట్టుకు ఆడడం గర్వకారణం

క్రీడాకారుడు ద్వారకనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

   అనంతపురం కలెక్టరేట్‌ : భారత్‌ బాస్కెట్‌ బాల్‌ జట్టులో అనంతపురం నగరానికి చెందిన కె.ద్వారకనాథ్‌ రెడ్డి ఆడడం జిల్లాకు గర్వకారణం అని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ తెలియజేశారు. భారత్‌ బాస్కెట్‌ బాల్‌ జట్టులో ఎంపికై ఆడిన ద్వారకనాథ్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నాడు కలెక్టర్‌ను కలెక్టర్‌ ఛాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనంతపురం నగరంలోని ద్వారకానగర్‌కు చెందిన కె.ద్వారకనాథ్‌ రెడ్డి అండర్‌- 18లో భారత్‌ బాస్కెట్‌ బాల్‌ జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. అనంతరం రకానాథ్‌రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో షఫీ, బాస్కెట్‌ బాల్‌ కోచ్‌ ఎల్‌.వంశీ రెడ్డి, తల్లి చంద్రిక, పాల్గొన్నారు.

➡️