ప్రజాశక్తి-అనంతపురం
అనంతపురం జెఎన్‌టియు విశ్వవిద్యాలయం పరిధిలో మర్చి నెలలో నిర్వహించిన ఫార్మ డి, ఎం.టెక్ నాలుగవ సంవత్సరం (ఆర్ 17) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు, రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య ఆదేశాల మేరకు డైరెక్టర్ అఫ్ ఎవాల్యుయేషన్ వి.నాగ ప్రసాద్ నాయుడు, కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ ఎపి.శివ కుమార్, అడిషినల్ కంట్రోలర్స్ జి.శంకర్, శేఖర్ రాజు, డా||ఎం.అంకారావు, డా||ఎస్. శ్రీధర్‌లు వీటిని విడుదల చేశారు. పరీక్షా ఫలితాల కోసం షషష.jఅ్‌బaతీవరబశ్ర్‌ీర.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.