రూమన్‌ టెక్నాలజీస్‌తో జెఎన్‌టియు ఒప్పందం

ఒప్పంద పత్రాలను చూపుతున్న ఇన్‌ఛార్జి విసి సుదర్శనరావు

ప్రజాశక్తి -అనంతపురం

అనంతపురం జెఎన్‌టియు బెంగళూరు రూమన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు జెఎన్‌టియు ఇన్‌ఛార్జి ఉపకులపతి హెచ్‌.సుదర్శనరావు, రిజిస్ట్రార్‌ ఎస్‌.కష్ణయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఈ ఒప్పందంతో అనంతపురం జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉపయోగకరమని తెలిపారు. సాఫ్ట్‌ స్కిల్స్‌తో పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఒప్పందాన్ని విద్యార్థులు అందరూ సద్వియోగం చేసుకునేలా అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓస్‌డి టూ వీసీ ఎన్‌.దేవన్న, అకాడమిక్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌వి.సత్యనారాయణ, బెంగళూరు రూమన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు రక్షిత్‌ శెట్టి, డైరెక్టర్‌ బి.వెంకట్‌ రెడ్డి, ప్రాజెక్టు మేనజర్‌ పిఆర్‌.భానుమూర్తి, పి.సుజాత, సి.శోభాబిందు, జి.ప్రశాంతి, బి.ఈశ్వర్‌ రెడ్డి, కిరణ్మయి, సురేష్‌ బాబు, వైశాలి ఘోర్పడే, శివ కుమార్‌, ప్రిన్సిపాల్‌ పి.చెన్నారెడ్డి పాల్గొన్నారు.

➡️