కియా ప్రతినిధులతో జెఎన్‌టియు విసి భేటి

కియా ప్రతినిధులతో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి విసి సుదర్శనరావు

ప్రజాశక్తి -అనంతపురం

అనంతపురం జెఎన్‌టియు ఇన్‌ఛార్జి విసి హెచ్‌.సుదర్శన్‌ రావు కియా కార్ల కంపెనీ ప్రతినిధులతో వర్సిటీ పరిపాలన భవనంలో బుధవారం నాడు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇన్‌ఛార్జి విసి మాట్లాడుతూ జెఎన్‌టియు విద్యార్థులకు ఇంటర్నషిప్‌, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సహకరించాలని కియా ప్రతినిధులను కోరారు. కియా పరిశ్రమను సందర్శించడానికి అధ్యాపకులు, విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. అనంతరం కియా బందం జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల, వివిధ విభాగాల ల్యాబ్‌లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీమెన్స్‌ ల్యాబ్స్‌ పరిశీలనలో వాటి గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కియా ప్రతినిధులు హాంగ్‌సంగ్‌ పార్క్‌, హాంగ్‌ కిమ్‌, హన్‌, ఒఎస్‌డి ఎన్‌.దేవన్న, రిజిస్ట్రార్‌ ఎస్‌.కృష్ణయ్య, ప్లేస్‌ మెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.విశాలి, ప్రిన్సిపాల్‌ పి.చెన్నారెడ్డి, ఉమా శంకర్‌ పట్నాయక్‌, రమేష్‌ బాబు, ఎంఎస్‌.విజయ పారు, అకాడమిక్‌ డైరెక్టర్‌ కోఆర్డినేటర్‌ డా||అరుణ మస్తాని, వివిధ విభాగాల అధిపతులు డా||కళ్యాణి రాధ, డా||ఎం.రామ శేఖరరెడ్డి, ప్లేస్‌ మెంట్‌ కోఆర్డినేటర్‌ జె. శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️