సభ్యత్వ నమోదు తీసుకుంటున్న జెవివి నాయకులు
అనంతపురం కలెక్టరేట్ : వైజ్ఞానిక సమాజం నిర్మాణం కోసం విద్యార్థి దశ నుండే శాస్త్రీయ దక్పథం కలిగి ఉండాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్ తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నగరంలోని కెఎస్‌న్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న కొన్ని అశాస్త్రీయ సంఘటనలకు కారణం ప్రజల్లో శాస్త్రీయ చైతన్యం లేకపోవడమే అన్నారు. ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దక్పథం అలవర్చుకోవాలన్నారు. జెవివి నగర గౌరవాధ్యక్షురాలు డా||పి.ప్రసూన మాట్లాడుతూ కొంతమంది బాబాల అవతారం ఎత్తి అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి మానప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన ఇలాంటిదే అన్నారు. ఇలాంటి వాటి పట్ల పూర్తి స్థాయిలో చైతన్యం కలిగి ఉండి దొంగబాబాల నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ పి.శంకరయ్య జెవివి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంగే నాయక్, విజయలక్ష్మి, లలిత, నగర అధ్యక్ష, కార్యదర్శులు వీరరాజు, రామిరెడ్డి నాయకులు లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ప్రసాద్ రెడ్డి, పాల్గొన్నారు.