వికలాంగులకు కత్రిమ కాళ్లు అందజేత

వికలాంగులకు కృత్రిమ కాళ్లను స్వయంగా అమరస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

      అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముగ్గురు వికలాంగులకు కత్రిమ కాళ్ల (ఆర్టిఫిషియల్‌ లెగ్స్‌)ను కలెక్టర్‌ డా||వి.వినోద్‌ కుమార్‌ సోమవారం నాడు పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్లూరు మండలం కందిగోపుల గ్రామానికి చెందిన వెంకట రామయ్య, ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన ఓబులమ్మ, గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన భాగ్యమ్మకు ఒక్కొక్కరికి రూ.3 వేలు విలువజేసే కత్రిమ కాళ్లు, వెయ్యి రూపాయలు విలువజేసే చేతికర్రలను అందించారు. వికలాంగులు వారు కూర్చొన్న చోటుకే కలెక్టర్‌ వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వికలాంగులకు కత్రిమ కాళ్లు అందజేసేందుకు విస్తతంగా అవగాహన కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖ ఎడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్‌ పాల్గొన్నారు.

➡️