తిమ్మసముద్రం గ్రామ పరిసరాల్లో ఎపిఐఐసి భూములను పరిశీలిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్
కళ్యాణదుర్గం : తిమ్మసముద్రం రెవెన్యూ పరిధిలో సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని తిమ్మసముద్రం రెవెన్యూ గ్రామ పరిధిలో 2010వ సంవత్సరవంలో అప్పటి ప్రభుత్వ సేకరించిన 1035ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయా భూముల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే అంశాలపై స్థానిక ఆర్‌డిఒ రాణిసుస్మిత, తహశీల్దార్ భాస్కర్‌తో కలిసి చరించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం సోలార్ పార్క్, కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు అణువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తాగునీరు, ప్రధాన రహదారులు రోడ్డు, తదితరు చర్చించారు. ప్రభుత్వ భూములు ఇతరుల ఆక్రమణలో ఉన్నాయా..లేక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయనే అంశాలను ఆర్‌డిఒను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ భూముల్లో కుట్టిన పరిశ్రమలు, తదితర పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సలహాలు చేస్తుందని అంశాలను తెలిపారు. ఆయా భూములపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు.