పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్
ప్రజాశక్తి -పెనుకొండ టౌన్ : దీర్ఘకాలికంగా వున్న పారిశుద్ధ్య కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు
రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిఐటియు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పారిశుద్ధ్య కార్మిక సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.అనంతరం నగర పంచాయతీ మేనేజర్ నాగరాజు కి వినిత పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ పట్టణంలో జనాభా అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. గత 17 రోజులుగా సమ్మె ప్రభుత్వం అంగీకరించిన మినిట్స్ కాఫీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐలో ఉన్న లోపాలను సరిచేయాలని, 17 రోజుల సమ్మె కాలం జీతం, పండుగ కానుకగా వెయ్యి రూపాయలు వెంటనే ఇవ్వాలని, కార్మికులకు పనిముట్లు, యూనిఫామ్ తదితర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు చిన్న వెంకటేష్, ఈ ,వెంకటేష్,నరసింహులు, లక్ష్మీదేవి, నరసమ్మ, చంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.