డిఎంఅండ్‌హెచ్‌ఒ కార్యాలయంలో మొక్క నాటుతున్న కలెక్టర్
అనంతపురం అర్బన్ : ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి హరిత అనంతను సాధిద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. హరిత అనంత ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి.దేవితో కలిసి మొక్క నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. హరిత అనంతను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం నాటిని మొక్కలను సంరక్షిస్తామని కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ గంగాధర్ రెడ్డి, కార్యాలయ పరిపాలన అధికారి గిరిజా మనోహర్ రావు, మలేరియా నివారణ అధికారి ఓబులు, స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, డెమో త్యాగరాజు, ఆరోగ్య బోధన అధికారి గంగాధర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు విజయ భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్ కుమార్, పవన్, కమలాకర్ రాజు, లక్ష్మన్న పాల్గొన్నారు.