జెఎన్‌టియును అగ్రభాగాన నిలుపుదాం

క్యాలెండర్లను విడుదల చేస్తున్న ఇన్‌ఛార్జి విసి, తదితరులు

ప్రజాశక్తి -అనంతపురం

అనంతపురం జెఎన్‌టియును బోధన, బోధనేతర సిబ్బంది సమిష్టి సహకారంతో జాతీయ ర్యాంకింగ్‌లో అగ్రభాగాన నిలుపుదామని ఇన్‌ఛార్జి ఉపకులపతి హెచ్‌.సుదర్శన రావు తెలిపారు. వర్సిటీలోని ఆర్యభట్‌ అడిటోరియంలో అకాడమిక్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన అనంతపురం జెఎన్‌టియు-2025 క్యాలెండర్‌, ఆప్కాస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విసితో పాటు రిజిస్ట్రార్‌ ఎస్‌.కృష్ణయ్య, ఓస్‌డిటు వీసీ ఎన్‌.దేవన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ వర్శిటీ అబివద్ధికి ప్రతి ఉద్యోగి తోడ్పాటు అవసరమన్నారు. 2025 సంవత్సరంలో మంచి మెరుగైన జాతీయ ర్యాంకింగ్‌, నాక్‌ నుంచి మంచి గ్రేడ్‌ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రిజిస్ట్రార్‌ కృష్ణయ్య మాట్లాడుతూ అధ్యాపకులు, భోధనేతర సిబ్బంది, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కలిసి కట్టుగా పనిచేస్తే యూనివర్సిటీ మరింత అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎపి డైరెక్టర్‌ ఎస్‌వి.సత్యనారాయణ, యూనివర్సిటీ డైరెక్టర్లు సురేష్‌ బాబు, నాగప్రసాద్‌ నాయుడు, దుర్గా ప్రసాద్‌, సుజాత, వైశాలి గొర్పడే, వర్షిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఏపీ. శివకుమార్‌, ఓటిపిఆర్‌ఐ డైరెక్టర్‌ జివి.సుబ్బారెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వసుంధర, పులివెందుల కళాశాల ప్రిన్సిపాల్‌ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

➡️