తాడిపత్రిని ‘మోడల్‌’గా తీర్చిదిద్దుదాం

తాడిపత్రిని 'మోడల్‌'గా తీర్చిదిద్దుదాం

ఉపాధి కింద చేపట్టిన పనులను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-తాడిపత్రి

అందరం సమిష్టిగా కృషి చేసి తాడిపత్రి మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే జెసి అస్మిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్య స్వగృహంలో నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖలకు చెందిన ఇంజినీర్లు, ఎంపిడిఒలు, ఇఒఆర్‌డిలు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా శాఖల పరిధిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. నేను మీకు పూర్తి అండగా ఉంటా.. నియోజకవర్గ అభివృద్ధికి మీరు అండగా ఉండాలని కోరారు. ముఖ్యంగా గ్రామాల్లో కిందిస్థాయి అధికారులు సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తాగునీటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

➡️