జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు లోహిత్ ఎంపిక

Nov 28,2024 13:16 #Anantapuram District

ప్రజాశక్తి-కొండూరు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండూరులో 9వ తరగతి చదువుతున్న టీ.లోహిత్ “జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు” ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషగిరి బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈనెల 24 నుండి 26 వరకు అండర్ 14 బేస్బాల్ పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళం ట్రెండ్స్, తిరుపతిలో జరిగాయి. మన ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున ఆడిన టీం క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. అందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి టీ.లోహిత్ బాగా ఆడి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్లు ఆడిన లోహిత్ ఒక హోమర్ కొట్టి సెలెక్టరుల దృష్టిలో పడ్డాడు. అలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన లోహిత్ ను జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపిక చేశారు. లోహిత్ మన ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఛత్తీస్గడ్ లోని బిలాస్పూర్ లో డిసెంబర్ 19 నుండి 22 వరకు జరిగే జాతీయస్థాయి బేస్బాల్ పోటీల్లో పాల్గొంటాడు. అక్కడ కూడా బాగా రాణించాలని కోరుకుంటూ, అభినందనలు తెలియపరుస్తున్నాము. కార్యక్రమంలో హెచ్ఎం, శేషగిరి బాబు, పిడి, శివకుమార్ ఉపాధ్యాయులు ఎల్ఆర్ గోపి, ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.

➡️