స్వర్ణోత్సవ మహాసభను విజయవంతం చేయండి

ప్రజాశక్తి-బొమ్మనహాల్‌

యుటిఎఫ్‌ సంఘం ఏర్పడి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహాసభను విజయవంతం చేయాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వి.గోవిందరాజులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని దేవగిరి క్రాస్‌ ప్రాంగణంలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో యుటిఎఫ్‌ మండల స్వర్ణోత్సవ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50ఏళ్లలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. జీవో 117ను రద్దు చేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని, ఉన్నత పాఠశాలలో సమాంతరం మీడియంతోపాటు తెలుగు మీడియంను కొనసాగించాలని, పాఠశాలల పని వేళల మార్పు తక్షణమే విరమించుకోవాలని కోరారు. వీటితోపాటు అనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల గౌరవాధ్యక్షులు ఎం.నాగభూషణం, అధ్యక్షులు సి.మల్లిఖార్జున, ప్రధాన కార్యదర్శి ఎం.ఆంజనేయులు, సహాధ్యక్షులు బసప్ప, సహాధ్యక్షురాలు సి.వాణిశ్రీ, కోశాధికారి ఎం.అశోక్‌, సీనియర్‌ నాయకులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు మండల నాయకులు కె.నాగరాజు, రామలింగదేవి, సునీత, బ్రహ్మేశ్వరి, రాజేశ్వరి, పద్మజ, త్రినాథరావు, దాని మహేష్‌కుమార్‌, మధుసూదన్‌, మల్లికార్జున, రవివర్మ, మహేశ్వర, ఎం.మధు, నగేష్‌, సి.ఉమేష్‌, కె.రామిరెడ్డి, ఎ.రామునాయుడు, గోపాల్‌నాయక్‌, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

➡️