ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి

Oct 3,2024 11:27 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక బెల్దర్ కాలనీకి చెందిన కుళ్లాయప్ప (38) ఆరోగ్యం బాగా లేకపోవడంవల్ల అర్ధరాత్రి అశ్వస్వతకు గురి కావడంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుల్లాయప్ప కుటుంబ సభ్యులు నార్పల ప్రాథమిక వైద్యశాలకు పిలుచుకొని రావడం జరిగింది. ఆ సమయంలో వైద్యశాలలో వైద్య సిబ్బంది ఎవరు లేకపోవడం నైట్ డ్యూటీలో ఉన్న నర్సు(ఎఫ్ఎన్ఓ) భర్త ఇంజక్షన్ వేయడం వల్లనే కుల్లాయప్ప మరణించాడని కుల్లాయప్ప బంధువులు ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు… ఇంజక్షన్ నేనే వేసాను అంటున్న నైట్ డ్యూటీ నర్స్…. తాను రాత్రి డ్యూటీలో ఉన్నానని కుల్లాయప్పకు ఇంజక్షన్ తానే వేశానని తనకు ఆరోగ్యం బాగా లేకపోతే తన భర్త తోడుగా వచ్చాడని తన భర్త ఇంజక్షన్ చేయలేదని నర్సు అంటున్నారు. లేదు నర్సు భర్తనే ఇంజక్షన్ చేశాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎవరు ఇంజక్షన్ వేశారు తెలుసుకోవడానికి పోలీసులు వైద్యశాలలోని సిసి కెమెరా ఫుటేజ్ లు పరిశీలన కోసం చూడగా ప్రాథమిక వైద్యశాలలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదని వైద్య సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సింగనమల్ల సిఐ కౌలుట్లయ్య డాక్టర్ ప్రవీణ్ కుమార్ వైద్య సిబ్బందితో వివరాలు సేకరించి మృతుని భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మరణించిన నిరుపేద కుల్లాయప్ప కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని కుల్లాయప్ప మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుల్లాయప్పకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఆ పిల్లలను ప్రభుత్వమే రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లప్ప డిమాండ్ చేశారు.

➡️