మార్కెట్లోకి మారుతీ సుజుకీ న్యూ షిఫ్ట్‌

మార్కెట్లోకి మారుతీ సుజుకీ న్యూ షిఫ్ట్‌

నూతన షిఫ్ట్‌ కారును ఆవిష్కరిస్తున్న అతిథులు

అనంతపురం : నగరంలోని జయలక్ష్మి మారుతీ షోరూంలో నూతన షిఫ్ట్‌ కారును గురువారం ఆవిష్కరించారు. సరికొత్త టెక్నాలజీ, నూతన హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తయారు చేసిన సరికొత్త మారుతీ న్యూ షిఫ్ట్‌ కారు మార్కెట్లోకి ఆవిష్కరించినట్లు షోరూం జనరల్‌ మేనేజర్‌ గిరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్‌బిఐ రీజినల్‌ మేనేజర్‌ రమేష్‌బాబు, సోషల్‌ మీడియా ప్రతినిధులు డాక్టర్‌ హరిప్రసాద్‌, జిఎన్‌ఎస్‌ వైభవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఆవిష్కరించిన షిఫ్ట్‌ మోడల్‌లో బేసిక్‌ స్థాయి నుంచి ఆరు సేఫ్టీ బెలూన్స్‌, నైన్‌ ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌ వైర్లెస్‌ ఛార్జర్‌ స్పోర్ట్స్‌ మోడల్‌ తదితర నూతన సౌకర్యాలతో కొత్తకారును తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, టీం లీడర్లు రవితేజ, భాస్కర్‌, షోరూం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️