నమో నారసింహా.. నమో నమామి..

నమో నారసింహా.. నమో నమామి..

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ప్రజాశక్తి-వజ్రకరూరు

ఉరవకొండ మండలం పెన్నోబిలం క్షేత్రంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. ముందుగా స్వామివారి మూలవిరాట్‌కు విశేష పుష్పలంకరణ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం అందంగా అలంకరించిన ఉత్సవ విగ్రహాలను ఇఒ విజరుకుమార్‌, అర్చకులు ద్వారాకనాథ్‌స్వామి, బాలాజీస్వామి ఆధ్వర్యంలో పల్లకిలో ఉరేగింపుగా తీసుకెళ్లి రథంలో కొలువుదీర్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం బ్రాహ్మణుల ఆధ్వర్యంలో మడుగుతెరు లాగారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువుదీర్చి రథనాఇ్న లాగారు. ‘లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవింద’ అంటూ భక్తులు స్వామి నామస్మరణతో పులకించిపోయారు. ఉత్సవానికి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాల ద్వారా ఉరవకొండ పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️