సమస్యలపై విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం

సమస్యలపై విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి జి.విశాలాక్షి

ప్రజాశక్తి-గుత్తి

గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై ఎపిఎస్‌పిడిసిఎల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి జి.విశాలాక్షి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. సర్పంచులు మజ్జిగ గోపాల్‌, ఆర్‌.గురుమస్తాన్‌ మాట్లాడుతూ తమ గ్రామాల్లో విద్యుత్తు సమస్యలు నెలకొన్నాయని వాటికి పరిష్కరించడానికి సిబ్బంది, అధికారులు రావడం లేదన్నారు. మండలానికి ట్రాన్స్‌ కో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ లేరని, ఎడిఇ సాయిశంకర్‌ కి ఫోన్‌ చేస్తే సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వివిధ మండలాధికారులు వారి శాఖల పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ఎస్‌.తిరుపాలమ్మ, ఎంపిడిఒ డి.ప్రభాకర్‌, తహశీల్దార్‌ డి.ఓబిలేసు, ఇఒఆర్‌డి శివాజీరెడ్డి, సిడిపిఒ ఎన్‌.ఢిల్లేశ్వరి, ఎంఇఒ బి.రవినాయక్‌, పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, హౌసింగ్‌ ఎఇలు మల్లేష్‌నాయక్‌, అశ్విని, సూర్యనారాయణ, ఎపిఎం అరుణకుమారి, సర్పంచులు పి.భరత్‌కుమార్‌, ఎ.వెంకటేష్‌, కె.రమేష్‌నాయుడు, బేడల లక్ష్మీదేవి, ఎ.లావణ్య, చిన్న ఆంజనేయులు, పాపన్న, ఎంపిటిసిలు ఎం.ధనుంజయ, చిన్న ఈరన్నగౌడ్‌, జింకల నారాయణస్వామి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

➡️