పాలవెల్లువా మహిళలల్లో అవగాహన ఏది 

Feb 10,2024 14:07 #Anantapuram District
no awareness on palavelluva

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఐకెపి కార్యాలయంలో ఏపీఎం నిర్లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవగాహన కల్పించడంలో మండల మహిళా సమైక్య అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆత్మకూరు మండలంలో ఆసరా కార్యక్రమం మొదలుకొని అన్ని మహిళా సంఘాల, సంక్షేమ పథకాలన్నీ కూడా, ప్రజలకు చేరవేయండంలో ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని, అంతే కాకుండా కనీసం పత్రిక విలేకరులకు ప్రజా ప్రతినిధులు నిధులు కూడా సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ పథకాలు అవగాహన పై అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చును. ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి ఐకెపి అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.

➡️