ఆత్మకూరు మండలంలో ఫెవికాల్ వీరుల గాథ!
ఆ శాఖల్లో చక్రం తిప్పుతున్న ఫెవికాల్ వీరులు
ప్రజాశక్తి-ఆత్మకూరు : ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగుల బదిలీలు సహజమే. మూడేళ్లకో,ఐదేళ్లకొకసారి ఉద్యోగస్తులు బదిలీలు చట్టం ప్రకారం కావడం ఆనవాయతీ. అయితే అందుకు భిన్నంగా ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ శాఖల్లో ప్రధాన శాఖలైన రెవిన్యూ, పోలీస్ శాఖ వ్యవస్థలో విధులు నిర్వర్తిస్తున్న ద్వితీయ శ్రేణి ఉద్యోగులు ఇరువురు, మండలంలోని ఆయా శాఖల్లో చక్రం తిప్పుతూ, అక్రమ ఆస్తులు అర్జిస్తూ, వారి కంటే ఎక్కువ వస్తాయి అధికారులను సైతం గుప్పెట్లో పెట్టుకుని వారు చెప్పింది జరగాలంటూ, పై అధికారులకు వాకబు చేస్తూ, ఏ రాజకీయ పార్టీలు మారిన, ఆయా పార్టీ నాయకుల కనుసన్నల్లో విధులు నిర్వర్తిస్తూ, వారి పదవులు బదిలీ కాకుండా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. వివరాల్లోకెళితే ఆత్మకూరు మండల రెవెన్యూ శాఖలోని మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నాగభూషణం గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు చేపట్టారు. అప్పట్లో సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ మండల నాయకులు కణసనల్లో విధులు నిర్వహించాడు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికార పార్టీ తెదేపా మండల నాయకులు వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తే, ఆర్ ఐ అర్జెంటుగా బదిలీ చేయాలని ఆలోచించారు. వారి ఊహాగారాల ప్రకారం తెదేపా అధికారంలోకి వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగభూషణం ప్రస్తుత అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ, వారి అండదండలతోనే బదిలీ కాకుండా ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రస్తుతం ఆర్ఐ ఆ పార్టీ నేతలకు తలోగ్గి నాయకులు చెప్పిన మాట వేదవాక్యంగా వింటూ, నివేదికలు రాసి తప్పుడు నివేదికలతో అర్హులను అనర్హులుగాను, అనర్హులను అర్హులు గాను, తప్పుడు నివేదికలు తయారుచేసి, అక్రమాలకు పాల్పడుతూ, అక్రమ ఆస్తులు, సంపాదన అర్జిస్తున్నారని, ప్రత్యక్షంగా మండలంలో ప్రజల నోట వినబడుతోంది.
ఇకపోతే ప్రజలు కాపాడాల్సిన పోలీసులు చట్టం లో మండల పోలీసులు శాఖ లో ఏ. ఎస్. ఐ గా విధులు నిర్వర్తిస్తున్న మరో ఉద్యోగి వరుణాచారి. మండల పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ఐ వర్ణాచారి అంటే అందరూ హాడలే. పాపం పుణ్యం లేని ఏఎస్ఐ అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని మండలంలో పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ చెప్పిందే వేదవాక్యంగా కొనసాగుతోంది. ఏఎస్ఐ అక్రమంగా డబ్బే సంపాదన కాకుండా, తమ బంధువుల పేరు మీద స్థిరాస్తులు కూడా హయాంలో ఉచితంగా సంపాదించి, ప్రస్తుతం వాటిని గురించి అక్రమ సంపాదన చేస్తున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో అప్పట్లో క్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ లను పట్టుకుని, స్టేషన్కు తరలించకుండా వేలాది రూపాయలు దన్నుకున్నాడనే ఆరోపణలు వ్యక్తిగతమవుతున్నాయి , అంతేకాకుండా ఎందరు ఎస్ఐలు సీఐలు మారిన, ఏళ్లు తరబడి గడిచిన ఆత్మకూరు స్టేషన్లోనే ఏఎస్ఐ గా విధులను నిర్వర్తిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. వాహన చోధకులు ఆటో డ్రైవర్ల సైతం ఏ ఎస్సై కు దొరికిందంటే డబ్బు కట్టాల్సిందే భయందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు మారిన ఆయా శాఖల అధికారులు మారిన ఆత్మకూరు మండలంలో రెవిన్యూ కార్యాలయంలో ఆర్ఐ, మండల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ వీరి బదిలీల సంగతి మాత్రం జిల్లా స్థాయి అధికారులు కూడా పట్టించుకోలేదని నిర్మొహటంగా చెప్పవచ్చును , ఏది ఏమైనా మేం కదిలేదే లే అనే ధీమాతో పై ఉద్యోగస్తుల విధులు నిర్వహణ కొనసాగుతోందని మండలంలో ఏ నోట విన్న వారి మాటే వినపడుతోంది.