ఎన్టీఆర్ ఎంఐజి లేఔట్ ల బ్రోచర్ విడుదల

Jan 8,2025 12:05 #Anantapuram District

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మడకశిర కూడేరు గుత్తి ప్రాంతాలలో చేపట్టదలచిన ఎన్టీఆర్ ఎంఐ జి లేఅవుట్ల బ్రోచర్లను బుధవారం స్థానిక అహుడా కార్యాలయంలో చైర్మన్ టి సి వరుణ్ వైస్ చైర్మన్ అయిన జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ప్లానింగ్ ఆఫీసర్ కమ్మూరు మహమ్మద్ ఇషాక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుష్యంత కార్యదర్శి గౌరీ శంకర్ టిపిఓ హరీష్ చౌదరి శరత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ధర్మవరం దగ్గర కునుతూరు పెనుగొండ కందుకూరు ప్రాంతాలలో ఏర్పాటు చేసి మౌలిక వసతులను కల్పించామన్నారు ధర్మవరం దగ్గర కునుతూరులో 120 ఎకరాలలో లేఔట్లను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు అయితే ఇక్కడ ఇంకా ప్లాట్లు మిగిలి ఉన్నాయన్నారు కందుకూరు లేఅవుట్లో స్థలాలన్నీ అమ్ముడుపోయాయన్నారు మడకశిర కూడేరు గుత్తిలో ఏర్పాటు చేయనున్న ఎంఐజి లేఔట్లలో ఉద్యోగులు ప్రజలు తమ స్థలాలకై అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని కోరారు ఒకేసారి స్థలానికి సంబంధించిన మొత్తము చెల్లించిన వారికి ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వబడును అని చెప్పారు అలాగే 20% స్థలం విలువలు చెల్లించి తమ కు కేటాయించిన ప్లాటును అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు అహుడా ఆధ్వర్యంలో చేపట్టిన లేఔట్ లన్నింటిని ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు

➡️