సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ ఇబి.దేవి
ప్రజాశక్తి-అనంతపురం
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారులు, స్కానింగ్ సెంటర్ల డాక్టర్లకు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఇవి.దేవి సూచించారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం సమావేశ భవనంలో వైద్య అధికారులు, వివిధ స్కానింగ్ సెంటర్ల డాక్టర్లకు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ స్కాన్ సెంటర్లలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదన్నారు. ఈరోజుల్లో ఆడపిల్లలు అన్నిరంగాల్లో ముందుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘భేటీ బచావో బేటీ పడావో’ అన్న నినాదంతో ప్రజలను మేలుకొలుపుతోందన్నారు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అన్నారు. అనంతరం నాగరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంపై పూర్తి అవగాహన కల్పించారు. ఉమెన్, ఛైల్డ్ సిడిపిఒ శ్రీదేవి, కృష్ణమాచారి పాల్గొని ఆడపిల్లల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్, పట్టణ డీఎస్పీ శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమ జీన్స్, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రవిశంకర్, డెమో త్యాగరాజు, డిప్యూటీ హెచ్‌ఇఒ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.