విజేతలకు బహుమతులు అందజేత

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా అనంత బాలల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. శనివారం ఇందిరానగర్‌లోని అనంత బాలల సంఘం కార్యాలయంలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఎంతో సృజనాత్మకత దాగి ఉందన్నారు. ర్యాంకులు, మార్కులు వంటి వేట పెట్టే విధానంలో ఇలాంటి ఆటలు, పాటలు, పోటీలు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పోటీలు నిర్వహించిన అనంత బాలల సంఘం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత బాలల సంఘం నాయకులు చంద్రిక, అశ్విని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️