టిప్పర్లతో తిప్పలు…

Feb 10,2024 13:28 #Anantapur District
problem with heavy load trucks

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని కడవకల్ గ్రామ సమీపంలోని, పంట పొలాలలోని నల్ల మట్టిని, ఇతర గ్రామాలలోని పంట పొలాలకు టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా అధికలోడుతో ఊరి సందులలో వెళుతుండడంతో మట్టి అంత రోడ్డుపైన పడటం వలన కడవకల్లు గ్రామంలోని బిసి కాలనీలో లో నివాసం ఉంటున్న చిన్న పిల్లలు పెద్ద వాళ్లు డస్ట్ అలర్జీ జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందులోనే చిన్నపిల్లల స్కూలు ఉండడంతో ఏమి జరుగుతున్నానని దీనివల్ల బిసి కాలనీలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అధిక లోడుతో వెళుతున్న వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ కాలనీ వేడుకుంటున్నారు.

➡️