జాగ్రత్తగా ఈవీఎంల ర్యాండమైజేషన్‌

ఈవీఎంలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

       అనంతపురం : ఈవీఎంల ర్యాండమైజేషన్‌ కోసం ఏర్పాట్లను జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. బుధవారం నాడు అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి చేపట్టే ఈవీఎంల ర్యాండమైజేషన్‌ కోసం ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ కోసం ఎన్ని టేబుల్స్‌, కౌంటర్స్‌ ఏర్పాటు చేసుకోవాలి, తదితర వివరాలను ఆరా తీశారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీవో జి.వెంకటేష్‌, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, తహశీల్దార్‌ శివరామిరెడ్డి పాల్గొన్నారు.

➡️