పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు

ఎమ్మెల్యే దగ్గుపాటికి కృతజ్ఞతలు తెలుపుతున్న పద్మశాలి వెల్ఫేర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోతుల లక్ష్మీనరసింహులు

ప్రజాశక్తి-అనంతపురం అర్బన్‌

తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని, దానికి ఉదాహరణ తానేనని పోతుల లక్ష్మీ నరసింహులు అన్నారు. పద్మశాలి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోతుల లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి చొరవతోనే తనకు పదవి వచ్చిందన్నారు. పార్టీలో కష్టపడి పని చేస్తున్న తనను గుర్తించి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో పద్మశాలీయుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు జింక సూర్యనారాయణ, కుంచెపు వెంకటేష్‌, వెంకటరాముడు, మంజు నాథ్‌, కుల్వంత్‌ స్వరూప్‌, రాజేశ్వరి, వడ్ల భావన, మంజుల నారాయణ, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️