కోడ్ ఉంటేనే నిబంధనలు

Jun 10,2024 15:29 #Anantapuram District

బార్లు షరా మామూలే
ప్రధాన రహదారి పక్కనే మద్య సేవనం
నిద్ర పోతున్న అధికార యంత్రాంగం 
ప్రజాశక్తి -అనంతపురం క్రైం: సార్వత్రిక ఎన్నికలు, కౌంటింగ్ ముగిసేవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ఉన్నంత వరకు బార్ల యాజమాన్యాలు కచ్ఛితంగా నిబంధనలు పాటించాయి. కోడ్ ముగిసిన వెంటనే షరా మామూలే అన్నట్లుగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నా యి. అంటే అధికార యంత్రాంగం నిద్ర పోతోందా? లేక మామూళ్ల మత్తులో జోగుతోందా? అన్న బహిరంగ చర్చ జరుగుతోంది. వివరాల మేరకు బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచాలి. 11 గంటల అనంతరం ఒక గంట పాటు కేవలం భోజనానికి మాత్రమె అనుమతి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు ఉదయం 10 గంటలకు తెరుచుకున్న బార్లు ప్రస్తుతం ఉదయం 6 గంటలకే తెరుచుకుంటున్నాయి. అంటే అధికార యంత్రాంగం నిద్ర పోతోందా లేక మామూళ్ల మత్తులో జోగుతోందా అని ప్రజల్లో బహిరంగ చర్చ జరుగుతోంది. అసలు బార్ల వెనుక ఉన్న రహస్య శక్తి రాజకీయ నాయకులా లేక అధికారులు మామూళ్లా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది . కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు ఊరిబయట ముళ్ల పొదల్లో మద్యం సేవిస్తున్నా పట్టుకొచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు కోడ్ ముగియగానే పట్టించుకోవడం లేదు. దీంతో ప్రధాన రహదారి పక్కనే మద్యం సేవిస్తున్నారు.

➡️