ఇసుక దోపిడీని అరికట్టాలి

ఇసుక దోపిడీని అరికట్టాలి

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం

రాష్ట్రంలో కొనసా గుతున్న ఇసుక దోపిడీని అరికట్టాల ని వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేద న్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఉన్న సంపదను టిడిపి నేతలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ జరుగుతున్నా, మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇసుకను ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా నియంత్రించలేని పరిస్థితి ఉన్నారన్నారు. నిత్యం ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో నే ఇసుక తరలిపోతోందన్నారు. చంద్రబాబు గానీ, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేష్‌కు గానీ ఇసుక దోపిడీ కనిపించకపోవడం బాధాకరమన్నారు. గతంలో రూ.15 వేలకు దొరికే ఇసుక నేడు రూ.22 వేలకు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ఇక మద్యం పాలసీలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మద్యం దుకాణాలకు టెండర్లు వేయకూడదని ప్రతి ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. దరఖాస్తు చేసుకున్న వారిని ఏకంగా సీఐలు, డీఎస్పీలే ఫోన్లు చేసి మద్యం షాపులకు డీడీలు కట్టి వేసుకుంటే మంచిది కాదని, స్టేషన్లకు రావాలని పిలుస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతరులు వ్యాపారాలు, కాంట్రాక్టర్లు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైసిపి ప్రజల పక్షాన నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఎస్పీ, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు స్పందించి మద్యం, ఇసుక విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

➡️