15 నుంచి కూలీల వద్దకు స్కూటర్‌ యాత్ర

15 నుంచి కూలీల వద్దకు స్కూటర్‌ యాత్ర

మాట్లాడుతున్న వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15 నుంచి 20వతేదీ వరకూ చేపడుతున్న ఉపాధి హామీ పనులు చేసే కూలీల వద్దకు స్కూటర్‌ యాత్ర చేపట్టనున్నట్లు ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి తెలిపారు. గురువారం గణేనాయక్‌ భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం 4 నుంచి 10 గ్రామాల వరకూ స్కూటర్‌ యాత్ర పనులు దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు. ఆయా సమస్యలను ఈనెల 20 నుంచి 24వతేదీ వరకూ గ్రామ సచివాలయాల్లో అర్జీలు ఇచ్చి ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. అప్పటికీ పరిష్కరించకపోతే ఏప్రిల్‌ మొదటి వారంలో డ్వామా పీడీ, కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సూరి, ఉపాధ్యక్షులు భాస్కర్‌, కృష్ణ, నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి సోమశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు పెద్దయ్య, తేరి, నాగప్ప, నాగలింగమయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️