ఆస్ట్రేలియా ప్రతినిధులతో అనంత ఎంపి అంబికా లక్ష్మీనారాయణ
ప్రజాశక్తిలి-అనంతపురం రూరల్
ఎంతో అనుకూలమైన అనంతపురం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని అనంతపురం ఎంపి అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆస్ట్రేలియా ప్రతినిధుల సమావేశంలో సహచర ఎంపీలతో కలిసి ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్‌తో జిల్లా పరిస్థితలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా హార్టికల్చర్‌కు ఎంతో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు పెడితే ఎంతో లాభదాయకంగా ఉంటుందని వివరించారు. అంతేగాకుండా రెన్యువబుల్ ఎనర్జీ (సోలార్ ఎనర్జీ, విండ్ పవర్) సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేకమంది ఉపాధి కలుగుతుందని, వనరులను సమర్థవంతంగా వాడుకోవచ్చని తెలిపారు.