ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని గోపురాజ్ పల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో ఎల్లనూరు మండలంలోని నిట్టూరు గ్రామానికి పొలం పనులకు వెళ్తుండగా గిర్రమ్మ బావి సమీపంలో ఆటో బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదు మందికి తీవ్ర గాయాలు, ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిలో గోపాల్, శ్రీనివాసులు, పెద్దిరాజు, గంగాధర, పెద్దిరాజు, వీరికి గాయాలు కాగా వీరిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.