ఐటిఐ విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ కృషి

Nov 29,2024 13:07 #Anantapuram District

ప్రజాశక్తి-హిందూపురం : ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో శ్రీకంఠాపురం దగ్గర ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలను పరిశీలించారు. ప్రభుత్వ ఐటిఐలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నెలకొన్న అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేయాలని అదే విధంగా ఈ కళాశాలలో అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం స్కీముని వర్తింపజేయాలని, ఉన్నతాధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి పాల్గొన్నారు.

➡️