ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని పప్పూరు, బొందలవాడ చెత్త సంపద కేంద్రాలను బుధవారం ఈవో ఆర్ డి శైలజారాణి పంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. గ్రామ సర్పంచ్ ఆలం శిరీష సహకారంతో ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ కు ఫెన్సింగ్, మరియు పెయింటింగులు వేయించి షెడ్ ని తిరిగి ఫంక్షనింగ్ లోనికి తీసుకొని రావటం అయినది అని ప్రస్తుతానికి 2 తోట్టెలలో బెడ్డింగ్ వేసి. వర్మి వదలనున్నాము అని మిగిలిన చెత్త సంపద కేంద్రాలన్నింటిని ఒకటో తేదీ నుంచి వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నామని యువార్డు తెలిపారు. ఆమెతోపాటు కార్యదర్శులు శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.