సత్తా చాటిన శిరిడి సాయి విద్యార్థులు

May 16,2024 13:01 #Anantapuram District

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో సత్తా చాటిన నార్పల శిరిడి సాయి విద్యాలయం (ఆనంద్ స్కూల్) విద్యార్థులు

ప్రజాశక్తి-నార్పల :  మండల కేంద్రంలోని స్థానిక నార్పల శిరిడి సాయి విద్యాలయం (ఆనంద్ సార్ స్కూల్) విద్యార్థులు బుధవారం వెలువడిన ఐదో తరగతి బీసీ గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలలో సత్తా చాటారు షిరిడి సాయి విద్యాలయంలో శిక్షణ తీసుకున్న బిల్లే మనీ, జగన్మోహన్ రెడ్డి, వినయ్, ప్రజ్ఞా సాయి అనే విద్యార్థులు 50 మార్కులకు 50 మార్కులు సాధించి జిల్లా లో ప్రధమ స్థానంలో నిలిచారు. గత కొన్ని సంవత్సరాల నుండి షిరిడి సాయి విద్యాలయం విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి వివిధ గురుకుల పాఠశాలల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రవేశాలు పొందడంలో దోహదపడింది అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు అనంతరం విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు ఆనంద్ ను విద్యార్థుల తల్లిదండ్రులు సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు.బిల్లే మని అనే విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది

➡️