శివక్రిష్ణ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి శంఖుస్థాపన

Feb 2,2025 11:31 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో అదివారం శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు శివకృష్ణ చౌదరి చరవాణిలో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, అనారోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రస్టు తరుపున సహాయం అందించడం జరిగిందని భవిష్యత్తులో వ్యాప్తంగా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న సంకల్పంతో నార్పలలో శివకృష్ణ చారిటబుల్ ట్రస్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోట్రస్ట్ గౌరవాధ్యక్షులు మెల్లంపూటి సూర్యప్రకాష్, ట్రస్ట్ ప్రతినిధి కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు లగినేని నాగరాజు, బాబాఫకృద్దీన్, శాంతప్రకాష్ రెడ్డి, పసుపులేటి లక్ష్మీనారాయణ, ఈడిగ శ్రీధర్, బుడెన్ ఖాన్, ఇండ్ల రంగనాథ్, విశ్వనాథ్ రెడ్డి, చామలూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, రాము, గూగూడు లక్ష్మిరెడ్డి, ఎల్లుట్ల శ్రీనివాసులు, బింగి తిరుపతయ్య, గొల్ల చంద్ర, తుంపెర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️