19వ డివిజన్ కార్పొరేటర్ బాలాంజినేయులు వైసీపీ నుంచి టిడిపిలోకి చేరిక
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని 19వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ బాలాంజనేయులు ఆదివారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గతంలో కాంగ్రెస్, వైసీపీలో కీలకంగా పని చేసిన బాలాంజినేయులు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. దీంతో నగరంలో వైసిపి పార్టీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది. వైసిపి కార్పొరేటర్ బాల ఆంజనేయులుకు టిడిపి కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాల ఆంజనేయులు మాట్లాడుతూ నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఆకర్షితుడనై టిడిపిలో చేరానని తెలిపారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నాయకత్వంలో నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైసిపి కార్పొరేటర్ బాల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీలోకి చేరటంపై ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ స్పందిస్తూ బాలాంజనేయులు పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు ఆయన మంచి వ్యక్తిత్వం, కష్టపడి పని చేసే గుణం ఉన్న వ్యక్తియని తెలిపారు.కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి పార్టీలోకి వచ్చారు. గత కాంగ్రెస్, వైసీపీ హయాంలో ఆయన లాంటి వారికి న్యాయం జరగలేదు. కనీసం డివిజన్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. ఈ ఆరు నెలల్లోనే 30కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాలాంజినేయులకు బీసీ నేతగా పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ భరోసా ఇచ్చారు.