ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూపించండి  

Jun 10,2024 16:55 #Anantapuram District

ఎంపీడీవో రాముడు

ప్రజాశక్తి-నార్పల : ఈనెల 12వ తేదీ బుధవారం 11 గంటల 45 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల కార్యాలయల ఆవరణంలో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం చూపించాలని ఎంపీడీవో రాముడు పంచాయితీ కార్యదర్శులకు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని అందరు పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో రాముడు ఈఓఆర్డి శైలజారాణి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రతి పంచాయతీలోను కచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రత్యక్ష ప్రచారం చూపించాలని మేజర్ పంచాయతీ అయినా నార్పలలో స్థానిక బాలికల పాఠశాల ఆవరణంలోని ఆడిటోరియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బాలికల పాఠశాలలోని ఆడిటోరియాన్ని సోమవారం ఎంపీడీవో రాముడు తాసిల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

➡️