ప్రజాశక్తి-ఆత్మకూరు: ఎస్ఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య యాత్ర ఆదివారం మండల మండల కేంద్రంలో మరియు వడ్డిపల్లి తలపూరు గ్రామాలలో పర్యటించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజన సామాజిక తరగతుల కనీస సౌకర్యాల సాధన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఐద్వా కెవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జీపు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కెపిఎస., ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిద్దు జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ కెపిఎస్ జిల్లా నాయకులు జగ్గులు రమేష్ రాము నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి ఐద్వా ఉపాధ్యక్షురాలు చంద్రకళ రామాంజనమ్మ సిపిఎం మండల కార్యదర్శి శివ శంకర్ మరియు ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రమ్మ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన సమాజంలో అత్యధిక మంది పేదల బ్రతుకులు మారడం లేదని అధికారంలోకి వచ్చిన నేతలంతా సామాజిక న్యాయం గురించి మాట్లాడడమే కానీ దాన్ని అమలు చేసే వారే లేరన్నారు. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల్లో అత్యధిక మందికి ఈనాటికీ సొంత ఇల్లు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని అర్థ ఎకరా పొలం కూడా లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. పాలకుల ఆర్భాటాలతో ఇస్తున్న స్వచ్ఛభారత్, స్వచ్ఛ్ ఆంధ్ర నినాదాలు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యాయని ఇప్పటికీ త్రాగడానికి మంచినీరు, రోడ్లు, మురికి కాలువలు, మరుగుదొడ్లు, వీధిలైట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, స్మశాన స్థలాలు వంటి కనీస సదుపాయాలు లేని పరిస్థితులు దళితవాడలో ఉందన్నారు. ఓవైపు మహిళలు, చిన్నారులు లైంగిక దాడులకు అత్యాచారాలకు వేధింపులకు బలవుతున్న చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలే నిద్రవస్తలో ఉన్నాయన్నారు. విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లకు మోక్షం కలగలేక అద్వాన్న స్థితిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి రాజేశ్వరమ్మ వెంకటమ్మ ఆచారమ్మ పంచాయతీ కార్మికులు శ్రీసత్యసాయి కార్మికులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
