కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ను నిరీక్షిస్తున్న ఎస్పీ గౌతమిశాలి

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

సార్వత్రిక ఎన్నికల కౌంటింగు రోజు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ గౌతమిశాలి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాల సంసిద్ధతను ఎస్పీ మంగళవారం తనిఖీ చేశారు. శాంతిభద్రతలు విఘాతం కలిగేలా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు, అల్లర్లు, ఘర్షణలు తలెత్తిన సందర్భాల్లో సద్దుమణిచేందుకు, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే గ్యాస్‌గన్‌, యాంటీ రైయిట్‌ గన్‌, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌, బాల్లిస్టిక్‌ క్యాట్రిడ్జిలు, తదితరాలను స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో ఉంచి ఒక్కో ఆయుధం ఎలా పని చేస్తుందో పరీక్షించారు. అన్నీ పక్కాగా పని చేసేలా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్‌ డీఎస్పీ మునిరాజ, ఆర్‌ఐలు రెడ్డెప్పరెడ్డి, రాముడు, మధు, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️