ప్రజాశక్తి-పుట్లూరు: ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల డిమాండ్ సాధనకై మార్చి 12న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు ఇచ్చారు. వంద రోజులు ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పని దినాలు కల్పించి సమ్మర్ అల్వెన్స్ పెండింగ్లో వేతనాలు ఇవ్వాలని, వలస కార్మికులకు ఉచితంగా రవాణా శాఖ భీమ క్యాష్ బండ అందించాలని, ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు నగదు, రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబానికి ఏడాదికి 12,000 నగదు మూడు సెంట్లు స్థలము ఎన్ని నిర్మించాలనికి ఆరు లక్షల నగదుతో పాటు ప్రతి దళిత కాలనీకి రెండు ఎకరాలు స్మశాన స్థలము ఉపాధి మేట్లకు పారితోష్కము ఇవ్వాలని సోమవారం సిపిఎం అనుబంధం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్చి 12న తేదీన విజయవాడలో భారీ ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఉపాధి కూలీలు వ్యవసాయ కూలీలు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ సూరి పిలుపునిచ్చారు. ఈరోజు అనేది పుట్లూరు మండల హెడ్ క్వార్టర్ లో కూలీలతో కలిసి అలాగే బాలాపూర్ గ్రామంలో కూలీలతో కలుపుకొని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది తదితర గ్రామాలలో కూడా పిలుపునిచ్చాము ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి టి పెద్దయ్య భాస్కర్ రెడ్డి జి వెంకట చౌదరి కే నాగభూషణ్వెంకట్రామిరెడ్డి రవణమ్మ లక్ష్మీదేవి సరస్వతి వ్యవసాయ కార్యదర్శి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
