ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు స్వచ్ఛత హి సేవ 2024 ముగింపు గ్రామసభ, ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా పాల్గొన్న సర్పంచ్ సుప్రియ ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు పంచాయతీ కార్యదర్శి అస్వర్తనాయుడు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మండలంలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాంతాల్లో విస్తరించడం జరిగిందని తెలిపారు. మండలంలో ఈ 15 రోజుల్లో జరిగిన స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలను నాలుగవ సచివాలయ కార్యదర్శి చరణ్ రెండవ సచివాలయ కార్యదర్శి పరశురాం వివరించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివాకర్ శైలజా రాణి తదితరులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నూర్ మొహమ్మద్ వార్డు సభ్యుడు కొత్త మిద్దె నాగభూషణ పంచాయతీ సెక్రటరీలు చరణ్ పరశురాం వరలక్ష్మి పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మేంద్ర కుమార్ మరియు గ్రామ ప్రజలు సచివాలయం సిబ్బంది అంగనవాడి ఆశా వర్కర్లు ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.