మెమొంటో అందుకున్న గుత్తి ‘గేట్స్’ విద్యార్థులు
ప్రజాశక్తి-అనంతపురం
నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న పాలిటెక్ ఫెస్ట్-2024లో పివికెకె ఐటి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన మూడు నమూనాలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో 17 కళాశాలకు చెందిన విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు. ఇందులో పివికెకె ఐటి పాలిటెక్నిక్ కళాశాల విద్యారులు 12 నమూనాలు ప్రదర్శించగా మూడు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా శ్రీబాలాజీ విద్యాసంస్థల ఛైర్మన్ పల్లె వెంకట కృష్ణక్రిషోర్ మాటలాడుతూ భవిష్యత్తులో తమ విద్యార్తులు ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్కుథలను పివికెకె ఐటి పాలిటెక్నిక్ కళాశాల పిన్సిపాల్ జిఎన్‌ఎస్ వైభవ్, సిబ్బంది అభినందించారు.