గిడుగు రామ్మూర్తికి నివాళులర్పిస్తున్న జెఎన్‌టియు సిబ్బంది
ప్రజాశక్తి-అనంతపురం
జెఎన్‌టియూలోని పరిపాలన భవనంలో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఒఎస్‌డి ఎన్.దేవన్న మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్లు పిఆర్.భానుమూర్తి, పి.సుజాత, ఎన్.విశాలి, బి.ఈశ్వర్‌రెడ్డి గ్యారీ, ఎస్‌వి.సత్యనారాయణ, కిరన్మయి, విబి.చిత్ర, ఎ.సురేష్‌బాబు, పద్మ సువర్ణ, ఎం.రామశేఖర్‌రెడ్డి, ఎపి శివకుమార్, పిఆర్‌ఒ బి.ఓంప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.జాతీయ క్రీడా దినోత్సవంజెఎన్‌టియూలోని క్రీడా మైదానంలో ఉన్న బాస్కెట్‌బాల్ కోర్టులో సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ధాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియు స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ బి.జోజిరెడ్డి, ఉప కులపతి ఓఎస్‌డి దేవన్న, కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వసుంధర, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ బి.జోజిరెడ్డి, పిఆర్‌ఓ బి.ఓంప్రకాష్, సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.