ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో టెన్త్‌ మోడల్‌ పరీక్ష

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో టెన్త్‌ మోడల్‌ పరీక్ష

గుత్తిలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-గుత్తి

పట్టణంలోని శ్రీ సాయి జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు మోడల్‌ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గేట్స్‌ కళాశాల కరస్పాండెంట్‌ వికె పద్మావతమ్మ మోడల్‌ పరీక్ష పేపర్లను విడుదల చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్‌, పాఠశాల కరస్పాండెంట్లు జయరంగారెడ్డి, కాంతరెడ్డి, కెఎస్‌కె ట్యూషన్‌ నిర్వాహకుడు సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ మోడల్‌ పరీక్ష పదో తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఇలాంటి మోడల్‌ పరీక్షలను ఉపయోగించుకుని మంచి ఉత్తీర్ణత పాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షులు బాలాజీ, నాయకులు నవీన్‌ యాదవ్‌, సాయి, జిలాన్‌బాషా పాల్గొన్నారు.

➡️