ఆధార్ సేవలు పునరుద్ధరించండి
సిపిఐ నాయకులు గంగాధర్.
ప్రజాశక్తి-నార్పల : గత 15 రోజుల నుండి సర్వ సమస్యతో నార్పల పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు ఆగిపోయాయి. దీంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తిరిగి ఆదార్ సేవలు పునరుద్ధరించాలని సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ కోరారు. గురువారం మండల కేంద్రంలోనీ స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలకు అంతరాయం కలిగి 15 రోజులు నుండి సర్వర్ పని చేయక ఆధార్ కార్డ్ సెంటర్ పనిచేయడం లేదు. దీనితో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిరోజు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆధార్ సెంటర్ పనిచేయడం లేదని తిరిగి వెళ్లడం జరుగుతుంది. ప్రతిరోజు దాదాపుగా వందమంది వరకు వచ్చి వెనక్కి వెళ్తున్నారు దీనిపైన అధికారులు వెంటనే స్పందించి మండల కేంద్రమైన నార్పల్లో పనిచేయని ఆధార్ సేవల్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి చాపల రామాంజి, పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్, నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్ద సూరి, తదితరులు పాల్గొన్నారు.