కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన

కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన

గుంతకల్లుతో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-గుంతకల్లు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రజల మరోసారి మోసం చేయడాన్ని వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు జగ్గిలి రమేష్‌, సాకే నాగరాజు మాట్లాడుతూ పార్లమెం టులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎపికి మొండిచేయి చూపించిందన్నారు. ముఖ్యంగా ప్రత్యేకహో దా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కన పెట్టిందన్నారు. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యాసంస్థకూ కేటాయింపులు చేయ లేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటి, ఐఐఎస్‌, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, వైజాగ్‌ మెట్రో, ఎయిమ్స్‌, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటిం చిన ప్రపంచ బ్యాంక్‌ రుణాన్నే పదే పదే ప్రస్తావించారన్నారు. అంతేతప్ప కొత్తగా కేటాయింపు లేదన్నారు. గత బడ్జెట్‌లో రాయలసీమ, ఉత్తరాంద్ర, ప్రకాశం జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలగా గుర్తించినా ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తీగా విస్మరించిందన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలన్నారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యుడు సురేంద్ర, నాయకులు షాబీర్‌, చంద్ర, ఓబులేసు, సూరి, రామునాయక్‌, నాగార్జున, ఎర్రిస్వామి, వెంకీ, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️