మంత్రి ఫరూక్‌తో జిల్లా ఆల్‌మేవా ప్రతినిధులు
ప్రజాశక్తి-అనంతపురం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఆల్‌మేవా సంఘం ప్రతినిధులు కోరారు. ఆదివారం ఆదివారం నంద్యాలలోని నేషనల్ పీజీ కళాశాలలో రాష్ట్ర ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) రాష్ట్ర వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫారూఖ్‌కు ఆల్‌మేమా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. మైనార్టీ ఉద్యోగుల సంఘం బలోపేతానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మైనారిటీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలని, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, వక్ఫ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రక్షించాలని, ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలులో ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున ప్రతి జిల్లా కమిటీలో ఇద్దరు ఆల్‌మేవా సభ్యులను నియమించాలని కోరారు. ముస్లిములకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగితించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ముస్లిములకు ఒబిసి రిజర్వేషన్లను అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మైనారిటీలకు సమచితంగా నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో పిఎంజెవికె పథకం ద్వారా కేటాయించి సముదాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఉర్దూ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ల ను కాంటాక్ట్ లెక్చరర్లుగా మార్పు చేయాలని, ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ ఉపాధ్యాయుల పోస్టులను డిరిజర్వ్ చేయడం ద్వారా స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కోరారు.