అదుపు తప్పిన ట్రాక్టర్ – వ్యక్తికి తీవ్ర గాయాలు 

Jun 9,2024 12:16 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల ముందర వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎక్స్లెటర్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో రోడ్డు పక్కన కూర్చున్న రంగయ్య, ధనుంజయలకు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా అనంతపురం తరలించారు. ప్రమాదానికి కారణం ట్రాక్టర్ అతివేగమే కారణమని అని పలువురు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఇటీవల కాలంలో మెయిన్ రోడ్ లో ట్రాక్టర్ డ్రైవర్లు ద్విచక్ర వాహన దారులు అతివేగంగా వాహనాలను నడుపుతూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మెయిన్ రోడ్ లో వాహనాలకు వేగ నియంత్రణ చేయాలని పలువురు కోరుతున్నారు. రంగయ్య ధనుంజయను అనంతపురం ఆస్పత్రిలో చేర్పించడం జరిగిందని వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఈఎంటి చంద్రమౌళి 108 పైలట్ రాజశేఖర్ తెలిపారు.

➡️